ఉదయం మనం తీసుకునే ఆహారం ప్రభావం రోజంతా ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్ధాలు తినటం వల్ల పొట్ట, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సిట్రిక్ యాసిడ్ ఉండే పండ్లు, ఫ్రైడ్ ఫుడ్, సుగంధద్రవ్యాలు జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, కార్బొనేటెడ్ పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కెఫిన్ ఉన్న పదార్థాలు, పాలు, జున్ను, పెరుగులోని లాక్టోస్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.