TG: మంత్రి కొండా సురేఖ.. సమంత, నాగ చైతన్యలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ వివాదంపై వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. అసలు ఎందుకు ఆ మాటలు వచ్చాయన్న దానిపై తెలుపాలన్నారు. రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీ వారి పేర్లను ప్రస్తావించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.