TG: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి కేటీఆర్కు జైలు భయం పట్టుకుందని అన్నారు. పదేళ్ల అక్రమాలు బయటకు వస్తాయని కేటీఆర్కు వణుకు మొదలైందన్నారు. భయంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నాలుగు రోజులు ఆగితే రేవంత్ అంటే ఏంటో చూస్తారని హెచ్చరించారు.