సీఎంగా బాధ్యతలు స్వీకరించే వేళ అతిశీ.. మాజీ సీఎం కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. కేజ్రీవాల్ కోసం ఆమె పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, వేరే సీట్లో కూర్చుని బాధ్యతలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆప్ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా, ఈ నెల 21న అతిశీ ఢిల్లీ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. ఇవాళ బాధ్యతలు చేపట్టారు.