TG: పట్టుదలతో రాష్ట్రానికి తీసుకొచ్చిన భారీ పెట్టుబడి.. కిటెక్స్ కంపెనీ అని మాజీమంత్రి KTR అన్నారు. ‘నేతన్నల తలరాత మార్చేందుకు తీసుకున్న మెగా సంకల్పం. అలనాటి వరంగల్ వస్త్ర వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు KCR ప్రభుత్వం చేపట్టిన మహత్తర కార్యం. ప్రపంచస్థాయి సంస్థలను ఒప్పించి, రప్పించి కాకతీయ టెక్స్టైల్ పార్క్‌ను కళకళలాడించేందుకు చేసిన కృషి. కేంద్ర సహకారం లేకున్నా.. సొంత నిధులతో ముందడుగు వేశాం’ అని ట్వీట్ చేశారు.