AP: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ను విధుల నుంచి తప్పిస్తూ ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. తప్పుడు ధ్రువపత్రాలతో అర్చకుడిగా విధుల్లో చేరినట్లు ప్రధాన అర్చకుడిపై ఆరోపణలు రావడంతో దేవాదాయశాఖ విచారణ నిర్వహించింది. ఆరోపణలు వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు. కాగా ఉప ప్రధాన అర్చకుడు గణేశ్ గురుకుల్కు ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు ఇచ్చారు.