TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. నాచారంలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గాడిదను చూస్తేనే గుర్రం విలువ, చీకటిని చూసినప్పుడే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. ప్రజలు ఛీ కొట్టి మళ్లీ 20 ఏళ్లు కాంగ్రెస్ మొహం చూడని పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్లో వాళ్లకు వాళ్లే తన్నుకుంటున్నారని వెల్లడించారు.