గుజరాత్లోని రాజ్పుత్ రాజ్పరా గ్రామంలో 2వేల మంది నివసిస్తుంటారు. అయితే ఇప్పటిదాకా అక్కడ సర్పంచ్ ఎన్నిక జరగలేదు. బాగా చదివిన వారు ఏకగ్రీవంగా సర్పంచ్ అవుతారు. ఏదైనా వివాదం వస్తే కూర్చుని పరిష్కరించుకుంటారు. అందుకే ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఒక్క పోలీసు కేసు కూడా లేదు. కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా కష్టాల్లో ఉన్నవారికి సహకరించుకుంటారు. ఇక్కడ చేబదులే తప్ప వడ్డీ వ్యాపారం ఉండకపోవడం విశేషం.