బీహార్ CM నితీష్ కుమార్ ఎన్డీయేలో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్లో ‘మహాగట్బంధన్’లో మళ్లీ చేరబోనన్నారు. ఉన్నతస్థాయి ఎన్డీయే సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నాయకుడు 2025లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ నేతృత్వంలోనే పోరాడుతామని ప్రకటించారు. మహాగటబంధన్తో పొత్తు పెట్టుకోవడంపై మాట్లాడుతూ తన పార్టీ సీనియర్ నాయకుల సలహా వల్ల చేసిన తప్పులుగా అభివర్ణించారు. ఆయితే ఆయన ఏ ఒక్కరి పేరు చెప్పలేదు.