ఇన్నాళ్లూ అబార్షన్ హక్కు సరికాదంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదించారు. ఇటీవల ఆ హక్కుపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు. అయితే, అబార్షన్ హక్కును ట్రంప్ సతీమణి మెలానియా సమర్థించినట్లు తెలుస్తోంది. ‘ఒక మహిళ తన శరీరంతో ఏమి చేస్తుందో నిర్ణయించే అధికారం ఆమెకు తప్ప మరొకరికి ఎందుకు ఉండాలి?’ అంటూ మెలానియా తన ‘మెమోర్’లో రాసినట్లుగా సమాచారం. కాగా, ఈనెల 8న మెలానియా పుస్తకం విడుదల కానుంది.