కొందరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఇష్టపడతారు. అయితే, ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం నిద్రపోతే మధుమేహం ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా అతి నిద్ర ఊబకాయానికి దారి తీస్తుంది. అతినిద్ర వల్ల అధిక తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వెన్ను నొప్పి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పెద్దలకు 8 గంటల నిద్ర సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.