TG: HYDలోని చర్లపల్లి టెర్మినల్ అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.430 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించినట్లు తెలిపారు. 9 ఫ్లాట్‌ఫామ్‌లు, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, 2 విశాల ఫుట్ఓవర్ బ్రిడ్జిలతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వందేళ్ల తర్వాత HYDకి మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. టెర్మినల్‌ను కిషన్ రెడ్డి పరిశీలించి మాట్లాడారు.