అంతరిక్ష కేంద్రం కమాండర్‌గా వ్యోమగామి సునీతా విలియమ్స్ వ్యవహరిస్తున్నారు. జూన్ 5న ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లి బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సమస్య తలెత్తడంతో వ్యోమగాములు సునీతా, విల్మోర్ అక్కడే చిక్కుపోయారు. 2012లో సాహసయాత్ర చేసిన సమయంలోనూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కమాండర్‌గా సునీత వ్యవహరించారు. తాజాగా ఆమెకు మరోసారి అవకాశం దక్కింది.