West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో బాలికను దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తన పెళ్లికి ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్లు ఆరోపించారు. రక్తపుమడుగులో ఉన్న బాలికను స్థానికులు రక్షించి కరీంపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత బ్రజెన్ మండల్ (45) అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.ఈ సంఘటన నదియాలోని హోగోల్బెరియా పోలీస్ స్టేషన్‌లోని సొండల్పూర్ ప్రాంతంలో జరిగింది. ఘటన అనంతరం స్థానికులు నిందితుడి ఇంటిని తగులబెట్టారు. అనంతరం అతడిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిందితుడి ఇంటి ముందు బైఠాయించారు.
చనిపోయిన మహిళ సోనాలి ఇల్లు హోగోల్బెరియా పోలీస్ స్టేషన్‌లోని సోండాల్పూర్లో ఉంది. బ్రజన్ సోనాలికి చాలా సంవత్సరాలుగా తెలుసు. ఏడాది క్రితమే ఆమెకు పెళ్లి ప్రపోజ్ కూడా చేశాడు. తన ప్రపోజల్‌ను ఆ యువతి తిరస్కరించడంతో ఆమెపై పలు రకాల ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అమ్మాయి బ్రజెన్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. పోలీస్ స్టేషన్లో బ్రాజెన్ పై ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు అరెస్టు చేశారు. జైలునుంచి వచ్చిన తర్వాత బ్రజెన్ మళ్లీ సోనాలిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు.
చదవండి:NTR-Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్‌పై హాలీవుడ్ నటుడు ప్రశంసల వర్షం..!
ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళుతుందోనని ఓ కన్నేసి ఉంచేవాడు. కాగా, శనివారం ఉదయం ట్యూషన్ ముగించుకుని ఇంటికి వస్తున్న సోనాలిపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె మెడ, నడుముపై దాడి చేశాడు. వెంటనే స్థానికులు ఆమెను కరీంపూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే బ్రజెన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ సంఘటన గురించి స్థానిక నివాసి మాట్లాడుతూ, బాలిక ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా బ్రజెన్ పదునైన కత్తితో ఆమెపై దాడి చేశాడు. కొద్దిసేపటికే రోడ్డు రక్తంతో తడిసిపోయిందని అన్నారు. సమాచారం మేరకు మృతదేహాన్ని కరీంపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.