AP: MLA నానాజీ వైద్య సిబ్బందికి క్షమాపణలు తెలిపారు. రంగనాయ మెడికల్ కాలేజీ వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరరావుపై ఆయన దురుసుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైద్య సంఘం సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయన ఘటనపై వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు. ‘వైద్యరంగాన్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూరితంగా జరిగింది. నా వ్యాఖ్యలు వృత్తిపరంగా వెళ్లాయి. ఆ వృత్తికి క్షమాపణలు చెబుతున్నా’ అని నానాజీ పేర్కొన్నారు.