డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్లో టీమిండియా(Team India) ఘోరంగా ఓడిన తర్వాత నెల రోజులు విరామం తీసుకుంది. వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో భారత్ అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20(T20) మ్యాచ్‌లు ఆడనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆ పర్యటన ముగిసిన తర్వాత ఐర్లాండ్(Ireland) కు టీమిండియా పయనం కానుంది. తాజాగా ఐర్లాండ్ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
ఐర్లాండ్(Ireland) జట్టుతో టీమిండియా(Team India) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఆగస్టు 18వ తేది నుంచి 23వ తేది వరకూ రెండు జట్లు తలపడనున్నాయి. సంవత్సరంలోపే టీమిండియాలో ఐర్లాండ్‌లో రెండోసారి పర్యటించనుంది. ఈ సందర్భంగా ఐర్లాండ్ క్రికెట్ సీఈవో వారెన్ డియోట్రమ్ బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఐర్లాండ్ పర్యటన ముగిసిన వారం రోజుల తర్వాత ఆసియా కప్ 2023 ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ(BCCI) తెలిపింది. గత ఏడాది హార్థిక్ పాండ్యా నేతృత్వంలో టీమిండియా(Team India) 2-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 2018లో కూడా ఐర్లాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఐర్లాండ్(Ireland)తో ఐదు మ్యాచ్‌లు జరగ్గా భారత్ అన్ని మ్యాచులు గెలిచింది.