Politics : అప్పుడు ఇల్లు.. ఇప్పుడు చెప్పులు.. ఏపీలో కొత్త రాజకీయాలు
కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలోనే రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకనాయకుడిపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయాలు చేయడం సహజం.
Politics : కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్(Election notification) రానుంది. ఈ క్రమంలోనే రాష్ట్రాల్లో రాజకీయాలు(politics) వేడెక్కాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకనాయకుడిపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయాలు చేయడం సహజం. అధికారంలో ఉన్న పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతూ ఉంటాయి. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని భూతద్దంలో పెట్టి ఎత్తి చూపుతాయి. ఏపీలోకి వచ్చేసరికి.. అధికార వైసీపీ నాయకుడు, సీఎం జగన్(CM Jagan)పై అక్కడ ప్రతిపక్షం టీడీపీ నాయకులు కూడా ఇదే తరహాలో రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఆయన విధానాలను.. ఎండగడుతున్నారు.తాజాగా జగన్ ధరించే చెప్పుల పైనా టీడీపీ(TDP) నాయకులు రాజకీయం చేయడం సంచలనంగా మారింది.
ఒకప్పుడు తమిళనాడుకు సీఎంగా ఉన్న జయలలితపై కూడా ప్రతిపక్షాలు ఇలానే విమర్శలు చేశాయి. ఆమె ధరించే చీరల నుంచి వేసుకునే చెప్పుల వరకు ప్రతీది విమర్శలకు కేంద్రాలయ్యాయి. అలానే.. ఇప్పుడు సీఎం జగన్ విషయంలోనూ ఆయన ధరించే బట్టలను వదిలేసినా.. ఆయన వేసుకుంటున్న చెప్పుల విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయంగా మారింది. జగన్ ఇంత ఖరీదు చెప్పులు వేసుకుంటారు.. అంటూ.. సోషల్ మీడియాలో జగన్ పై పక్క పార్టీల వాళ్లు భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి సీఎం జగన్ ఎప్పుడూ.. షూ ధరించలేదు. ఆయన ఎక్కడకు వెళ్లినా చెప్పులతోనే ఉంటారు.
చివరకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయినప్పుడు కూడా సీఎం జగన్ చెప్పులతోనే కన్పిస్తుంటారు. కానీ… ఇప్పటి వరకు ఈ విషయంపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ.. తాజాగా టీడీపీ నాయకులు చెప్పుల విషయాన్ని చర్చకు పెట్టారు. ఏపీ సీఎం జగన్ దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రుల్లో ఒకరు కావడంతో ఆయన స్థాయికి తగ్గట్టుగా లక్ష రూపాయల విలువైన చెప్పులు వాడుతున్నారని టీడీపీ ఎద్దేవా చేసింది. ఏపీ సీఎం జగన్ రెడ్డి చెప్పుల విలువ అక్షరాలా 1,34,800 రూపాయలుగా ఉందని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.