సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో…గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు తన తండ్రి మరణించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
నవంబర్ 22, 1939న జన్మించిన ములాయం సింగ్ యాదవ్ యూపీకి 3 సార్లు సీఎంగా పనిచేశారు. ఒకసారి రక్షణ మంత్రిగా, 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వారిలో ములాయం ఒకరిగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.