Redmi 12 Triple Rear Camera Launched: Price, Specifications is Here
Redmi 12: రెడ్ మీ 12 (Redmi 12) కొత్త మొబైల్‌ను చైనాకు చెందిన షావోమీ కంపెనీ విడుదల చేసింది. మూడు రంగుల్లో, మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో మొబైల్ అందుబాటులో ఉండనుంది. రెడ్ మీ 12 (Redmi 12) మీడియాటెక్ జీ88 ఎస్వోసీ మీద రన్ అవనుంది. ట్రిపుల్ రియర్ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జీంగ్ ఆప్షన్ ఇచ్చారు.
రెడ్ మీ 12 (Redmi 12).. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరెజ్ ధర రూ.17 వేల వరకు ఉండొచ్చు. 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరెజ్ మొబైల్ కూడా అందుబాటులో ఉంది. ఆ మొబైల్ ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. మిడ్ నైట్ బ్లాక్, పోలార్ సిల్వర్, స్కై బ్లూ షేడ్ కలర్లో లభిస్తోంది. డ్యుయల్ నానొ సిమ్స్ వాడాల్సి ఉంటుంది. 6.79 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే ఇచ్చారు.
ట్రిపుల్ రియర్ కెమెరా (triple rear camera) ఇచ్చారు. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ కాగా.. 8 మోగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రొ సెన్సార్ ఇచ్చారు. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఇచ్చారు. మిడ్ రేంజ్లో హై ఫీచర్స్ ఉన్న మంచి మొబైల్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.