• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ, వామపక్షాలు

అన్నమయ్య: పీపీపీ విధానంపై వైసీపీ, వామపక్షాలు అవస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి మండిపడ్డారు. ఇవాళ మదనపల్లెలోని ఆయన స్వగృహం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ విధానంతో ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందన్నారు. ఈ మేరకు కూటమి అభివృద్ధి చూసి ఓర్వలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

October 24, 2025 / 04:42 PM IST

‘మత్తు పదార్థాలకు విద్యార్థులు యువత దూరంగా ఉండాలి’

KNR: ‘నషాముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాల్లో కమిషనర్ ప్రపుల్ దేశాయ్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం యువత, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వారి భవిష్యత్తును అందాకారంలోకి నెట్టుతుందని అన్నారు. విద్యార్థులు, యువత ఒత్తిడిని అధిగమించేందుకు స్నేహితులు, తల్లిదండ్రులతో మాట్లాడటం, పుస్తకాలు చదవడం క్రీడలు, అలవర్చుకోవాలని అన్నారు.

October 24, 2025 / 04:41 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో UNO ఆవిర్భావ దినోత్సవం

NLR: విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సుజాత మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు ఐక్యరాజ్యసమితి సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మధు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

October 24, 2025 / 04:41 PM IST

ఇద్దరు రోగులకు మాజీ ఎమ్మెల్యే సాయం

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వాసుపల్లి గణేష్‌కుమార్ నియోజకవర్గంలోని ఇద్దరు క్యాన్సర్ రోగులకు రూ. 5,000 ఆర్థిక సాయం శుక్రవారం అందించారు. 33వ వార్డుకు చెందిన క్యాన్సర్ పేషెంట్ ఈటి లక్ష్మి ఇంటికి వెళ్లి పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. అందజేశారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు.

October 24, 2025 / 04:41 PM IST

‘పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి’

MNCL: కోటపల్లి మండలంలోని కొండంపేట, నాగంపేట, ఏసన్వాయి, ఏడగట్ట, పిన్నారం గ్రామాలలో అడవి పందుల దాడితో పత్తి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని శుక్రవారం అటవీ శాఖ అధికారి లావణ్యకు వినతిపత్రం అందజేశారు. అధికారులు వెంటనే స్పందించి పంట నష్టం పరిశీలించి తగిన పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

October 24, 2025 / 04:38 PM IST

ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వెల్లుట్ల, అన్నసాగర్ గ్రామాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి ఆరోగ్య కేంద్రాలు ముఖ్య భూమిక పోషిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్ఎంలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

October 24, 2025 / 04:37 PM IST

కొనుగోలు కేంద్రం పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

MDK: రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే పంటకు కనీస మద్దతు ధర లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ పాల్గొన్నారు.

October 24, 2025 / 04:36 PM IST

15 లక్షల క్వింటాళ్ల దాన్యం సేకరణ లక్ష్యం: డీఆర్డీవో

KMR: జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 15 లక్షల క్వింటాళ్ల దాన్యం సేకరించడమే లక్ష్యమని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ తెలిపారు. ఆయన నేడు నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పెట్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తేమ శాతం గుర్తించే యంత్రాన్ని పరిశీలించారు.

October 24, 2025 / 04:35 PM IST

‘పేదల జీవితలో వెలుగులు నింపడం అభినందనీయం’

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో రామచంద్రారెడ్డి కంటి ఆసుపత్రి ద్వారా వేలాది మంది జీవితలో వెలుగులు నింపడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. ఆసుపత్రి ఏర్పాటు చేసి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

October 24, 2025 / 04:35 PM IST

బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు: SP

TPT: బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరించారు. చంద్రగిరి సబ్ డివిజన్ MR.పల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు.

October 24, 2025 / 04:34 PM IST

విద్యార్థులకు నేత్ర పరీక్షలు

E.G: గోకవరం మండలం గంగంపాలెం ప్రభుత్వ ఎం.పీ.యు.పీ. పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ శిబిరంలో అప్తాలమిక్ ఆఫీసర్ సీహెచ్. ఆనందరావు 105 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆరుగురు విద్యార్థులకు దృష్టిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

October 24, 2025 / 04:34 PM IST

ఆర్పీ రిలాక్స్ సెంటర్‌ను ప్రారంభించిన శ్రీనివాసరావు

కృష్ణా: గుడివాడ రాజేంద్రనగర్‌లో ఆర్పీ రిలాక్స్ సెంటర్‌ను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. రిలాక్స్ సెంటర్‌ను ప్రారంభించడం ఎంతో శుభపరిణామమని శ్రీనివాసరావు అన్నారు. గుడివాడ దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి రిలాక్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.

October 24, 2025 / 04:33 PM IST

లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నశ్రీనివాస్

NLR: సంగం మండలంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు భారీగా కురిసాయి. ఈ నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పొంగి పొర్లుతున్న వాగులను శుక్రవారం టీడీపీ మండల అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి, సొసైటీ సాగునీటి సంఘాల సిబ్బంది పలువురు ప్రాంతాలను పరిశీలించారు. ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

October 24, 2025 / 04:33 PM IST

కాంగ్రెస్‌ది జాబ్‌లెస్ క్యాలెండర్: హరీష్ రావు

TG: నిరుద్యోగ బాకీ కార్డును మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని.. జాబ్‌లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. రాహుల్, ప్రియాంకలతో మాయ మాటలు చెప్పించి.. ఇప్పుడు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల బదులు మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని దుయ్యబట్టారు.

October 24, 2025 / 04:29 PM IST

చెరువులకు పూజలు చేసిన టీడీపీ నాయకులు

అన్నమయ్య: మదనపల్లె మండలం కోటవారిపల్లె గ్రామపంచాయతీలో లచ్చారెడ్డి చెరువు నిండి మొరవ పారడంతో టీడీపీ నాయకులు రాటకొండ మధుబాబు ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వరుస వర్షాలతో చెరువులన్నీ నిండి జలకలను తలపిస్తున్నయన్నారు. దీంతో త్రాగు, సాగునీరు సమస్య తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో చంద్రయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

October 24, 2025 / 04:29 PM IST