అసోంలోని జోర్హాట్ చౌక్ బజార్‌లో గురవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 500కుపైగా దుకాణ సముదాయాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు
రైతుల మేలు కోరి తన భూమిలోని ఎకరంన్నర భూమిని (Agricultural Land) ప్రభుత్వానికి అప్పగించాడు. ప్రభుత్వం నిర్మించిన కాలువ కోసం అంబటి రాయుడు భూమిని ఉదారంగా (Donated) ఇచ్చాడు. తత్ఫలితంగా ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో పెద్ద ఎత్తున పొలాలకు సాగునీరు చేరుతున్నది. అంబటి రాయుడు చేసిన మేలుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు అభినందించారు.
రాయలసీమ నీరు, వాటర్ ట్యాంకుకు సంబంధించి రోజా, నాగబాబుల మధ్య ఇటీవల ట్విట్టర్ (Twitter) యుద్ధం నడిచింది. ఈ అంశంపై నాగబాబుకు మద్దతుగా ఓ మహిళ... మంత్రి పైన దుమ్మెత్తిపోశారు. అంబటి రాంబాబు పర్యవేక్షణలో రోజా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు... నగరికి వైయస్సార్ పోలవరం అంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై (Andhra Pradesh Capital) మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి విశాఖ కొత్త రాజధాని కాబోతుందని, త్వరలో ఇక్కడి నుండి పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధానికి కావాల్సిన అర్హతలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు.
ఎవరూ ఔనన్నా కాదన్నా తెలంగాణ (Telangana) అంటే కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao).. కేసీఆర్ అంటేనే తెలంగాణ. తెలంగాణ తెచ్చింది.. ఇప్పుడు పాలిస్తున్నది కేసీఆర్. ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన కారణజన్ముడుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను భావిస్తున్నారు. అలుపెరగని పోరాటం చేసి ఢిల్లీ (Delhi) ప్రభుత్వాన్ని గజగజ వణికించి తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) తీసుకొచ్చిన ఘనుడు కేసీఆర్.
వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్‌ను నియమించింది.
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shah) పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తన స్నేహితుడితో కలిసి బుధవారం (ఫిబ్రవరి 15న) ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబయిలోని ఓషివారా(Oshiwara )పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
nara lokesh:సీఎం జగన్‌పై (cm jagan) టీడీపీ యువనేత నారా లోకేశ్ ఫైరయ్యారు. చిన్నారి మృతదేహాన్ని 120 కిలోమీటర్లు (120 km) బైక్ మీద పేరంట్స్ తరలించారు. ఈ ఘటన వీడియోను లోకేశ్ (lokesh) ట్వీట్ చేశారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రోమ్ చక్రవర్తి నీరో మీకంటే బెటర్ అంటూ మండిపడ్డారు. పబ్జీ ప్లేయర్ గారూ! అంటూ ట్వీట్లు వేశారు.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇవాళ పలువురికి ఇళ్ల స్థలాలు (House place) కేటాయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ (Cm kcr) ప్రకటన మేరకు పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్యకు (Mogilaya) కూడా హైదరాబాద్‌లో ఇంటి స్థలం పత్రాలను అధికారులు అందజేశారు.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ( DHO) గడల శ్రీనివాసరావు మరో వివాదం చిక్కుకున్నారు. అంతకు ముందు పలు కరోనా గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన సర్కులర్ కాంట్రవర్సీగా మారింది.
BJP MLC Madhav : రాజకీయంగా ఎదగడం కోసం కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారరని బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీ నారాయణ... బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఆ విషయం గురించి తర్వాత చెబుతానని ఆయన అన్నారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ వీడటంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.తాజాగా ఎమ్మెల్స...
GVL Narasimha Rao : కన్నా లక్ష్మీ నారాయణ.. బీజేపీని వీడారు. పార్టీని వీడుతూ వీడుతూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తనకు ఇప్పటికీ మోడీ పై గౌరవం ఉందని చెబుతూనే... సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చేసిన కామెంట్స్ పై తాజాగా జీవీఎల్ నర్సింహారావు స్పందించారు.
విమానయానం శిక్షణంలో (pilot training) యువతులు రాణిస్తున్నారు. గగనతలంలో విహరిస్తూ..నేటితరం యువతకు ఆదర్మంగా నిలుస్తున్నారు. వీరిలో కొందరు రైతు కుటుంబాల నుంచి రాగా మరికొందరు విమానయానంపై మక్కువతో వచ్చి శిక్షణ పొందుతున్నారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నారు.
chicken price reduce:నాన్ వెజ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. చికెన్ (chicken) ధర భారీగా తగ్గింది. మొన్నటి వరకు కేజీ చికెన్ రూ. 250 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడు అదీ కిలో రూ.160కి చేరింది. దీంతో చికెన్ (chicken) అంటే ఇష్టపడేవారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.