»Mla Guvwalas Impatience On The Distribution Of Mogiliahs House
MLA Guvwala : మొగిలయ్య ఇంటి స్థలం పంపిణీపై ఎమ్మెల్యే గువ్వల అసహనం
తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇవాళ పలువురికి ఇళ్ల స్థలాలు (House place) కేటాయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ (Cm kcr) ప్రకటన మేరకు పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్యకు (Mogilaya) కూడా హైదరాబాద్‌లో ఇంటి స్థలం పత్రాలను అధికారులు అందజేశారు.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇవాళ పలువురికి ఇళ్ల స్థలాలు (House place) కేటాయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ (Cm kcr) ప్రకటన మేరకు పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్యకు (Mogilaya) కూడా హైదరాబాద్‌లో ఇంటి స్థలం పత్రాలను అధికారులు అందజేశారు. అయితే, ఈ విషయం తనకు చెప్పకుండానే మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ చేశారని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ (Brs) ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్థలం పంపిణీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి, ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కొందరికి జూబ్లీహిల్స్, (Jubilee Hills),బంజారాహిల్స్‌లో స్థలాలు ఇచ్చారన్న బాలరాజు.. మొగిలయ్యకు మాత్రం బీఎన్‌రెడ్డి నగర్లో స్థలం ఇవ్వడమేంటని గువ్వల ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Balaraju) విమర్శలు గుప్పించారు. పద్మశ్రీ మొగిలయ్యకు హైదరాబాద్ శివారులోని బీఎన్ రెడ్డి నగర్ లో ఇంటి స్థలం కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. క్రీడాకారులకు ఖరీదైన లో ఇంటి స్థలం ఇచ్చి, మొగిలయ్యకు నగర శివారులో స్థలం కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కళాకారులకు కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud)వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బాక్సర్ నిఖత్ జరీన్,(Nikhat Zareen) షూటర్ ఇషా సింగ్ లకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల నగదును ప్రకటించింది. దీంతో పాటు బంజారాహిల్స్ లో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించింది. మొగిలయ్యకు రూ. కోటి నగదు, ఆయన కోరుకున్న విధంగా బీఎన్ రెడ్డి కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గువ్వల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.