Bandi Sanjay : తనకు కేటీఆర్ నోటీసులు పంపడం పై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. నోటీసులను తాను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలో రాములోరి కళ్యాణాన్నికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 30, గురువారం శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా సీత,రామ కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీం కోర్టు (Supreme Court) సీబీఐ కి కీలక ఆదేశాలు జారీ చేసింది.కేసు విచారణ నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30లోపు వివేకా హత్యకేసు (Viveka murder case) దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. ఇప్పటివరకు కేసును దర్యాప్తు చేసిన టీంను సీబీఐ (CBI) మార్చేసింది. సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో కొత్త టీంను ఏర్పాటు చేసింది.
బీజేపీ ఎంపీ గిరీశ్ బాపట్ (MP Girish Bapat) కన్నుమూశారు. ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతున్న పుణే (Pune) ఎంపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. తమ పార్టీ ఎంపీ గిరీశ్ బాపట్ మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) విచారం వ్యక్తం చేశారు. గిరీశ్ బాపట్ సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కీర్తించారు.
Bypoll : వయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. వయనాడ్ రాహుల్ గాంధీ నియోజకవర్గమన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన పై అనర్హత వేటు వేయడంతో... ఆ నియోజకవర్గానికి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహిస్తారని అందరూ భావించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scan) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను (MLC KAVITHA) మరోసారి విచారించాలని ఈడీ భావిస్తోంది. విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు విచారణ జరిపిన ఈడీ మరోసారి కొన్ని విషయాలపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తోంది. విచారణలో భాగంగా కవిత వద్ద ఉన్న ఫోన్‌లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Traffic Rules : దేశవ్యాప్తంగా రేపు శ్రీరామనవమి పండగను జరుపుకోనున్నారు. రేపు అన్ని రామాలయాల్లో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ క్రమంలోనే నగరంలో రేపు రాముని శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తొలి సినిమా (Movie)తో కలిశారు.. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు (Love).. అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి (Marriage) చేసుకున్నారు.. ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. కొన్నేళ్లు గడిచాక వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. సానుకూల వాతావరణంలో ఇద్దరు విడాకులు (Divorce) తీసుకుని చెరో దారిన వెళ్లిపోయారు. కానీ సమాజం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లను ఒంటరిగా ఉండనివ్వదు. ప్రతిచోట దానిప...
2024 అసెంబ్లీ ఎన్నికలు (andhra pradesh assembly elections 2024 ) ఎలా ఉంటాయనేది దేవుడి దయ (Sri Venkateswara Swamy) అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) అన్నారు. అయితే వచ్చే ఎన్నికలు మాకు తెల్లగా, ప్రతిపక్షాలకు నల్లగా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ.. పోలీసులతో (police) దాగుడు మూతలు ఆడుతున్నాడు. గత 10 రోజుల (10 days) నుంచి అతని కోసం పోలీసులు (police) ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం (నిన్న) తృటిలో తప్పించుకున్నారు. పంజాబ్ హొసియాపూర్ చెక్ పోస్ట్ వద్ద నుంచి అతని కారు వెళ్లింది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Election Date 2023) షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
Siddaramaiah also contest from Kolar:కర్ణాటక అసెంబ్లీకి (karnataka assembly) నగారా మోగింది. మే 10వ (may 10th) తేదీన ఎన్నిక జరగనుంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య (Siddaramaiah) వరుణ (varuna) నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతోపాటు కోలార్ (kolar) నుంచి కూడా పోటీ చేస్తారట. గత ఎన్నికల పోటీ గురించి ఆయన వివరించారు.
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (vijayawada international airport).. గన్నవరం (gannavaram airport) నుండి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు (International flights) ప్రారంభిస్తున్నారు.
MalliKarjun Karge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యారని ప్రధాని మోదీ విపక్షాలపై చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు.
ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాలనలో మాఫియా డాన్ లు (mafia don) వణికి పోతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, ఇష్టారీతిన ప్రవర్తిస్తే యోగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యోగి తీరు ఉగ్రవాదులు, మాఫియాను ఆందోళనకు గురి చేస్తోంది.