»A New Sit Has Been Set Up To Investigate Vivekas Murder Case
Supreme Court : వివేకా హత్య కేసు విచారణకు నూతన సిట్ ఏర్పాటు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీం కోర్టు (Supreme Court) సీబీఐ కి కీలక ఆదేశాలు జారీ చేసింది.కేసు విచారణ నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30లోపు వివేకా హత్యకేసు (Viveka murder case) దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. ఇప్పటివరకు కేసును దర్యాప్తు చేసిన టీంను సీబీఐ (CBI) మార్చేసింది. సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో కొత్త టీంను ఏర్పాటు చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీం కోర్టు (Supreme Court) సీబీఐ కి కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30లోపు వివేకా హత్యకేసు (Viveka murder case) దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. ఇప్పటివరకు కేసును దర్యాప్తు చేసిన టీంను సీబీఐ (CBI) మార్చేసింది. సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో కొత్త టీంను ఏర్పాటు చేసింది. ప్రస్తుత దర్యాప్తు అధికారి రాం సింగ్‌ను తప్పించింది. అతడి స్థానంలో కొత్త సిట్ ఏర్పాటు చేసింది. దీనికి డీఐజీ చౌరాసియా (DIG Chaurasia) నేతృత్వం వహిస్తారు. ఈ విషయాన్ని సీబీఐ.. సుప్రీంకోర్టుకు తెలిపింది.
సుప్రీంకోర్టుకు పంపిన ప్రతిపాదనల ప్రకారం.. కొత్త సిట్‌లో ఎస్పీ వికాస్ సింగ్(SP Vikas Singh), అడిషనల్ ఎస్పీ ముకేస్ కుమార్, ఇన్స్పెక్టర్ ఎస్. నవీను పునియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉంటారు. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ (CBI) తెలిపింది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివ శంకర్ రెడ్డి (Siva Shankar Reddy) భార్య తులసమ్మ వేసిన బెయిల్ పిటిషన్‌ను (Bail Petition) సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఏప్రిల్ 15లోగా దర్యాప్తును పూర్తి చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది . కొత్త సిట్‌ను (New sit)ఏర్పాటు చేస్తూ సీబీఐ ప్రతిపాదించగా కొత్త అధికారి నియమకం వల్ల విచారణ ఆలస్యమవుతున్నందును శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులసమ్మ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది.