»Telangana Health Director Srinivasa Rao Is In Another Controversy
DHO Srinivasa Rao : మరో వివాదంలో తెలంగాణహెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ( DHO) గడల శ్రీనివాసరావు మరో వివాదం చిక్కుకున్నారు. అంతకు ముందు పలు కరోనా గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన సర్కులర్ కాంట్రవర్సీగా మారింది.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ( DHO) గడల శ్రీనివాసరావు మరో వివాదం చిక్కుకున్నారు. అంతకు ముందు పలు కరోనా గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విడుదల చేసిన సర్కులర్ కాంట్రవర్సీగా మారింది. తెలంగాణ సీ ఎం కేసిఆర్(CM KCR ) పుట్టిన రోజు (Birth day) (ఫిబ్రవరి 17) సందర్భంగా..శుక్రవారం వైద్యఆరోగ్యశాఖలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తూ డీహెచ్ శ్రీనివాసరావు సర్క్యులర్ విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీల (Phc) ఆవరణలో రేపు మొక్కలు నాటాలని సర్క్యూలర్‌లో కోరారు. దీంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని.. రోగులకు పండ్లు పంచిపెట్టాలని ఆదేశిస్తూ సర్క్యులర్ విడుదల చేశారు. కాగా, సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరపాలని డిహెచ్ శ్రీనివాస్ రావు అధికారికంగా సర్కులర్ జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు పార్టీల నేతలు కూడా విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. కాగా,
అంతకుముందు కూడా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా కేంద్రంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ (semi chirstmas )వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాసరావు.. యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యామని.. మనం చేసిన సేవల వల్ల కాదు అంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ, తదితర అంశాలను కూడా ఆయన అప్పట్లో మాట్లాడటం చర్చనీయాంశమైంది. సుజాత నగర్ మండలంలోని జిమ్నా తండాలో నిర్వహించి పూజల్లో డీహెచ్ పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. స్వయంగా దేవతగా ప్రకటించుకున్న సుజాత నగర్ (sujathnagar )ఎంపీపీ విజయలక్ష్మి నిర్వహించిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన పూజల్లో పాల్గొన్నట్లు వీడియో రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్న శ్రీనివాసరావు (srinivasarao) క్షుద్రపూజల్లో పాల్గొన్నారంటూ ప్రచారం జరిగింది. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ( mla ) పోటి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది