• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది: VH

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచనలను CM రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

February 22, 2026 / 03:12 PM IST

వసతి గృహంలో హ్యాపీ సండేను వివరించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లెలో బాలికల వసతి గృహంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై.. పిల్లలందరికీ హ్యాపీ సండే పై వివరించి, ఆదివారం హ్యాపీ సండే ప్రాముఖ్యతను ఎమ్మెల్యే పిల్లలకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకొచ్చారన్నారు.

February 22, 2026 / 03:11 PM IST

నిడదవోలులో హనుమాన్ చాలీసా పారాయణ

E.G: నిడదవోలులో శ్రీరామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్తబృందం ఆధ్వర్యంలో ఆదివారం 53వ పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు చాలీసా పారాయణం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

February 22, 2026 / 03:10 PM IST

వెన్నం రాఘవేందర్ రెడ్డికి సీఎం నివాళి

MHBD:మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకుని వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రులుఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:09 PM IST

కోతులను తరిమికొట్టేందుకు వినూత్న ప్రయత్నం

KNR: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ, ఇండ్లపైకి చేరి బెంబేలెత్తిస్తున్న వానరాలను తరమడానికి శంకరపట్నం మండలం కరీంపేట గ్రామపంచాయతీ పాలకవర్గం వినూత్నంగా ఆలోచించి ఎలుగుబంటి డ్రెస్, మాస్క్‌ను తెప్పించింది. వాటిని ఓ వ్యక్తికి ధరింపజేసి గ్రామంలోని పలు వార్డులలో తిప్పుతూ కోతులను తరిమివేశే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

February 22, 2026 / 03:09 PM IST

గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలి

VZM: భోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. గ్రామాల అభివృద్ధికి అధికార యంత్రాంగం సహకరించాలన్నారు. అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై సర్పంచ్ లు, ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలన్నారు.

February 22, 2026 / 03:09 PM IST

YCP నేతలపై మంత్రి ఆగ్రహం 

AP: YCP నేతలపై మంత్రి బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరస్వామిని వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. అసెంబ్లీలో చెప్పులు ధరించి  వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకుని వచ్చారని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే పతనమైపోతారని హెచ్చరించారు.

February 22, 2026 / 03:08 PM IST

GJM చారిటబుల్ ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం

CTR: రెట్టగుంట గ్రామంలోని శ్రీ సుందర వినాయకస్వామి ప్రత్యేక పూజా అభిషేక కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి, గురజాల చెన్నకేశవులు నాయుడు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆయనకు ఘన స్వాగతం పలికిపూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన GJM చారిటబుల్ ఫౌండేషన్ తరపున ఆలయ అభివృద్ధికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.

February 22, 2026 / 03:08 PM IST

టీడీపీ నూతన కార్యాలయానికి శంఖస్థాపన

కడప: జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంఖస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి,కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ,మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతో పాటు రాష్ట్ర,పార్లమెంట్ కమిటీ నేతలు, జిల్లా పార్టీ నాయకులు హాజరయ్యారు.

February 22, 2026 / 03:07 PM IST

గుడిహత్నూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.

February 22, 2026 / 03:07 PM IST

చెన్నకేశవ స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: పదర మండలం రాయలగండి క్షేత్రంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. ఈ వేడుకలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణంలో తన వంతుగా సొంత నిధులు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను ఆహ్వానించిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 03:05 PM IST

YCP అబద్ధాల పునాదులపై పుట్టింది: అనగాని

AP: YCP అబద్ధాల పునాదులపై పుట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అంధకారం చేసి వెళ్లారని తెలిపారు. ప్రజలు జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. మండలిలో చెప్పులతో దేవుడి ఫొటోలు తీసుకొచ్చారని ఆరోపించారు.

February 22, 2026 / 03:04 PM IST

ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రి

కోనసీమ: రామచంద్రపురం అంకం వారి వీధి వెంకటనగర్‌లో నూతనంగా నిర్మించిన లక్ష్మీ గణపతి స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో జీవించాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.

February 22, 2026 / 03:02 PM IST

కలెక్టరేట్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళి

అనంతపురం కలెక్టరేట్‌లో ఆదివారం వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని పర్యాటక శాఖ, ఆన్ సెట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి అటూరి మాలోల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు వీరుడు నరసింహారెడ్డి అని ఆయన కొనియాడారు.

February 22, 2026 / 03:00 PM IST

భార్య, భర్తల మధ్య గొడవలు.. ఇలా చేయండి!

వైవాహిక జీవితంలో గొడవలు చాలా కామన్. కానీ ఇవి ఎప్పుడో ఒకసారి వస్తేనే బాగుంటుంది. పదేపదే జరిగితే జీవితం మీద విరక్తి వస్తుంది. అందుకే భార్యభర్తల మధ్య వాదన పెరిగేకొద్ది దూరం మరింత పెరుగుతుంది. అందుకే వాదనలను పెంచకుండా ఉండండి. ఒకరి మాటను ఇంకొకరు వినండి. ఇద్దరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. పురుషులు తమ భావాలను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి. ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి.

February 22, 2026 / 02:59 PM IST