NGKL: అచ్చంపేట నియోజకవర్గ గిరిజన బంజారా సోదరులకు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం పట్టణంలో నిర్వహించే వేడుకలకు అన్ని మండలాలు, గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ సంతోష్ హాజరుకానున్నారు.
సిద్దిపేట 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఖాదర్పురా, సీతారాం నగర్, ఇందిరానగర్, పాత బస్టాండ్, సుభాష్ రోడ్, మెదక్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
MBNR: బీసీలు రాజ్యాధికారంకోసం భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ ఉద్యమించాలని ఇంటలెక్చువల్ ఫోరం ఛైర్మన్ చిరంజీవులు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తూ.. అణచివేయడానికి ఆగ్రకుల నాయకులు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నెల్లూరు సౌత్ ట్రాఫిక్ AS1 వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న వీడియో వైరల్ గా మారింది. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.
మంచి గుండె ఆరోగ్యానికి వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన-ఏరోబిక్ కార్యకలాపాలతో పాటు వ్యాయామం చేయాలి. ఇందులో నడక, సైక్లింగ్ లేదా మెట్లు ఎక్కడం వంటివి ఉండొచ్చు. రోజుకు 10,000 అడుగులు పూర్తి చేయడం మంచి విషయమే అయినప్పటికీ.. ఇది గుండె రక్షణకు పూర్తి హామీ ఇవ్వదు. వాకింగ్‌తో పాటు సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడిని నిర్వహించడం అవసరం.
NLR: ఉదయగిరి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్ విధించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వాహన దారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు.
KNR: జమ్మికుంట మండలంలోని రైతులకు వివిధ కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి షేక్ ఖాదర్ హుస్సేన్ తెలిపారు. మాచినపల్లి HACA కేంద్రానికి 340, నాగంపేట DCMS 340, జమ్మికుంట JRUPSS కేంద్రానికి 340 బస్తాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. యూరియా అవసరమైన రైతులు సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకొని పొందవచ్చన్నారు.
TPT: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. విశాలాక్ష్మి నగర్ ఫ్లైఓవర్ వద్ద పూతలపట్టు-నాయుడుపేట హైవేపై లారీ రెండు బైక్‌లను ఢీకొట్టడంతో నారాయణపురం గ్రామానికి చెందిన చంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా సుధాకర్, రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, KMM, NLG, సూర్యాపేట, WGL, యాదాద్రి, RR, మేడ్చల్, VKBD, NGKL జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
MDK: ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయలవలదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు మండలంలోని ఇసుక పాలెంలో శాంత బయోటెక్నిక్స్ ఆధ్వర్యంలో శాంత – వసంత ట్రస్టు, శంకర నేత్రాలయ సహకారంతో నిర్వహిస్తున్న మెగా కంటి వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
ADB: ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని పాండ్రకవడ నుంచి ఆదిలాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ బస్సులోనే మర్చిపోయాడు. బస్సులో కండక్టర్‌గా విధుల నిర్వర్తించిన సి. సతీశ్ ఆ సెల్ ఫోన్‌ను స్టేషన్ మేనేజర్ శ్రీరాములు సమక్షంలో సదరు ప్రయాణికుడికి అప్పగించి ఉదరాత చాటుకున్నారు. అతన్ని పలువురు అభినందించారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. చైనీస్ సంప్రదాయం ఉట్టిపడేలా విద్యుత్తు లాంతర్లు, దీపాలతో మందిరాన్ని అందంగా అలంకరించారు. వివిధ దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.
కృష్ణా: నాగాయలంకలోని బీసీ గర్ల్స్ హాస్టల్‌లో శక్తి టీం-4 ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 181 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
కోనసీమ: అమలాపురం మండలం పాలగుమ్మి గ్రామదేవత తోటలమ్మ అమ్మవారికి 6 కేజీల వెండితో తొడుగు, మకరతోరణం, 111 కేజీల పంచలోహాలతో మరో మకరతోరణం ఆదివారం బహూకరించారు. పాలగుమ్మి చెందిన బొక్కా సత్యనారాయణ, రవికుమార్ కుటుంబ సభ్యులు అమ్మవారికి మకర తోరణాలు చేయించారు. రూ.30 లక్షల ఖర్చుతో వెండి వస్తువులను తయారు చేయించి అమ్మవారికి అలంకరించారు.