AP: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనపై కాసేపట్లో ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇవ్వనుంది. అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. కాగా కల్తీ పాల ఘటనలో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
MDK: అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద ఈ నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో సహకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఈ సందర్భంగా గ్రామస్థులు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
PDPL:ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో 45 నిమిషాల ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్లలో ఇంటర్ ప్రథమ 5120,ద్వితీయ 5247మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాలలో అన్ని సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9-12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు.
ADB: ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన మెరుగైన పాల ఉత్పత్తులని ప్రజలు వాడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలోని విజయ పాల ఉత్పత్తుల కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ ఛైర్మన్ బండారు అనూష తదితరులున్నారు.
కోనసీమ: రామచంద్రపురంలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ సోమవారం తనిఖీ చేశారు. ఆహార పదార్థాలను స్వయంగా రుచిచూసి నాణ్యతను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. పేదలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శుచీశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను, నిర్వాహకులను ఆయన ఆదేశించారు.
MNCL: గ్రామాల అభివృద్ధి ప్రణాళికలలో వార్డు సభ్యుల భాగస్వామ్యం ముఖ్యమైందని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీఓ జలంధర్ అన్నారు. జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు మండల కేంద్రంలోని రైతు వేదికలో రెండో విడత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు అవసరమన్నారు.
JGL: భీమారం మండలం గోవిందరం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమైక్య సంఘం (VO) భవన నిర్మాణానికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. అలాగే మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం వెల్లడించారు.
MNCL: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు CPI (ML) న్యూడెమోక్రసీ కోల్ బెల్ట్ కార్యదర్శి బ్రహ్మానందం తెలిపారు. రామకృష్ణాపూర్లో సోమవారం సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు, మేధావులు, న్యూడెమోక్రసీ కార్యకర్తలు సదస్సులో పాల్గొని సదస్సు విజయవంతం చేయాలన్నారు.
NRML: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వారు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.
WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవులు అనంతరం సోమవారం పున:ప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటాల్ పత్తి ధర రూ. 7,545, క్వింటాల్ తేజ మిర్చి ధర రూ. 18,300, క్వింటాల్ వండర్ హట్ ధర రూ. 37,000, క్వింటాల్ 341(కారం కాయ) ధర రూ. 22,100 గా ధరలు నమోదయ్యాయి.
VZM: దివంగత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ రణస్థలం మండలం జె. ఆర్. పురం సూర్య పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు లంక శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
KNR: రామగుండం కార్పొరేషన్ వెంకట్రావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేసే రమ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్ 16వ డివిజన్ నుంచి BRS అభ్యర్థిగా ఆమె పోటీ చేసి విజయం సాధించారు. చిన్ననాటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందన్నారు. గత ఎన్నికల్లో అదే డివిజన్‌లో భర్త కిషన్ రెడ్డి కార్పొరేటర్‌గా ఉన్నారు.
TG: హైదరాబాద్ కోఠిలో ఆశావర్కర్లు ఆందోళన చేస్తున్నారు. ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వచ్చిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ వారు చేస్తున్నారు. ధర్నా చేస్తున్న ఆశావర్కర్లను పోలీసులు పీఎస్‌కు తరలించారు. అలాగే, ధర్నాకు వస్తున్న ఆశావర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
KMM: తిరుమలాయపాలెం గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం సుబ్లేడులో కొత్తగా వారాంతపు సంతను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి ప్రతి వారం ఈ సంత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం సంత నిర్వహించే ప్రదేశాన్ని డోజర్‌తో శుభ్రం చేయించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.