నిజామాబాద్: గాంధారి మండలంలోని పర్మల్లతండాలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనవరి 26 నుంచి అందించే రైతు భరోసా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు బాలయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మదార్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సర్దార్ నాయక్, మాజీ సర్పంచ్లు ఉన్నారు.