TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్తరేషన్ కార్డుల ప్రక్రియపై అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ‘గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ నెల 16 నుంచి వెరిఫికేషన్, 20-24 మధ్య ప్రజాభిప్రాయ సేకరణ, 21-25 మధ్య డేటా ఎంట్రీ పూర్తి చేయాలి. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటన ఉంటుంది’ అని తెలిపారు.