PLD: నరసరావుపేట పట్టణంలో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందంగా ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు విక్రయాలు, వినియోగాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నిషేధిస్తున్నామని కమిషనర్ జస్వంత్ రావు పేర్కొన్నారు. వ్యాపార, వాణిజ్య వినియోగ సంస్థల యజమానులు నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి రూ.20 వేలు, అనంతరం లక్ష నుంచి 5 లక్షలు జరిమానా విధిస్తామన్నారు.