NLR: కావలి పట్టణంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వామి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… యువత వివేకానంద అడుగుజాడల్లో నడవాలన్నారు.