అనంతపురం: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా పర్యటన సందర్భంగా రద్దు చేసినట్లు తెలిపారు. డివిజన్, మండలాల్లో యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.