ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు తెలియజేశారు. ఎమ్మెల్యే నివాసం వద్ద నుంచి భారీ బైక్ లుతో టీడీపీ కార్యాలయం వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కావున టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.