ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఊసా వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం చంద్రశేఖరపురంలో వెలుగొండ సాధన సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన కనిగిరి ప్రాంతం, జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్నారు.