PLD: దేశాభివృద్ధిలో కీలకం యువత అని, అలాంటి శక్తికి స్ఫూర్తి స్వామి వివేకానంద అని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. దేశ విదేశాల్లో ఉన్న భారతీయ యువతను ప్రసంగాలతో, రచనతో ఉత్తేజపరిచారని, ఎదిగే స్ఫూర్తిని రగిలింప చేశారన్నారు.