SKLM: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు సిరాడ, తమిలిగూడ గ్రామాల్లో అక్రమంగా తయారు చేస్తున్న సారా తయారీ కేంద్రాలపై రెండు రాష్ట్రాల అబ్కారీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆయా చోట్ల 7,400 లీటర్ల ఊట, 1,140 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. దాడుల్లో అబ్కారీ అధికారి తిరుపతి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.