SKLM: ప్రధానమంత్రి నిర్దేశించిన వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశ ప్రజలందరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని సూర్య మహల్ జంక్షన్లో నిర్వహించిన స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మూలపేట పోర్టు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.