• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు

CTR: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హద్దులు మీరితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెంకటగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏవి రమణ హెచ్చరించారు. ఆదివారం మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి విపరీతమైన శబ్దాలతో డీజేలు, బైకుల సౌండ్లు నిర్వహిస్తే వారిపై అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.

December 29, 2024 / 07:57 PM IST

జనవరి 1న యధావిధిగా కూరగాయల మార్కెట్‌లో అమ్మకాలు

PDPL: జనవరి 1వ తేదీన పెద్దపల్లి కూరగాయల మార్కెట్‌లో అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయని రిటైల్ వ్యాపార అసోసియేషన్ సభ్యులు తీర్మానం చేశారు. కొన్నేళ్లుగా ప్రతినెలా 1వ తేదీన మార్కెట్ బంద్ చేస్తున్నామని, నూతన సంవత్సరం కావడంతో జనవరి 1న మార్కెట్‌లో అమ్మకాలు యథావిధిగా ఉంటాయని తెలిపారు. ప్రజలు గమనించాలన్నారు.

December 29, 2024 / 07:51 PM IST

డిసెంబర్ 31 వేడుకలు నిషేధం..!

NRML: నర్సాపూర్(జీ) మండలంలో డిసెంబర్ 31 వేడుకలు నిషేధమని ఎస్ఐ సాయికిరణ్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదన్నారు. మైనర్లతోపాటు ట్రిపుల్ రైడింగ్ చేయరాదని హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున గుమిగూడుతూ తిరగరాదన్నారు. డీజేలు నిషేధమని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.

December 29, 2024 / 07:49 PM IST

గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ప్రకాశం: బల్లికురవ మండలంలోని ఈర్లకొండ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని వెంకటేష్ అనే యువకుడు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి వివేకానంద రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా ఎస్సై జీవి చౌదరి తెలిపారు.

December 29, 2024 / 07:47 PM IST

వ్యవసాయదారులు ఒంటరిగా పనులకు వెళ్ళవద్దు ఎస్సై

MHBD: కొత్తగూడ మండల పరిధిలో పెద్దపులి తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కుశ కుమార్ హెచ్చరించారు. నేడు కొత్తగూడ పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయదారులు ఒంటరిగా చేనులలో పనులకు వెళ్ళవద్దని, పరిసర ప్రాంతాలను జాగ్రత్తగా గమనించాలని ప్రజలకు సూచనలు చేశారు.

December 29, 2024 / 07:46 PM IST

జగిత్యాలలో కిడ్నాప్ కలకలం

JGL: జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. పట్టణానికి చెందిన తల్లి తన కూతురితో అప్పుడే బస్సు దిగి ఆటో కోసం ఎదురు చూస్తుండగా కిడ్నాపర్ బాలికను ఎత్తుకుని పరార్ అవుతుండగా బాలిక తల్లి అరిచింది. స్థానికులు కిడ్నాపర్‌ను అడ్డుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

December 29, 2024 / 07:45 PM IST

మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. ఆదివారం శంషాబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన మహా పడిపూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

December 29, 2024 / 07:45 PM IST

మాజీ డిప్యూటీ సీఎంని కలిసిన మహిళా అధ్యక్షురాలు

KDP: మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్ఆర్ కడప జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా తెలుగుపులి వెంకట సుబ్బమ్మ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను ఆయన క్యాంపు కార్యాలయంలో సుబ్బమ్మ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. దుర్గా ప్రసాద్, సోషల్ మీడియా కో కన్వీనర్ సునీత రెడ్డి, పాల్గొన్నారు.

December 29, 2024 / 07:44 PM IST

నత్తనడకన అభివృద్ధి పనులు

PPM: పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా మక్కువ మండల వ్యాప్తంగా మంజూరైన అభివృద్ధి పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. సుమారు రూ.633 కోట్ల ఉపాధి హామీ నిధులతో 21 పంచాయతీల్లోని సుమారు 102 పనులు మంజూరు అయ్యాయి. వీటిలో కేవలం 33 పనులే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

December 29, 2024 / 07:43 PM IST

పోలీసు కానిస్టేబుల్ దేహధారుఢ్య పరీక్షలకు సర్వం సిద్ధం

SKLM: ఎచ్చెర్ల జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసు మైదానాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఎచ్చెర్ల పరేడ్ గ్రౌండ్‌లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించి ఆదివారం ఉదయం ట్రైల్ రన్ నిర్వహించారు. అభ్యర్థులకు ఛాతీ కొలత, ఎత్తు, ఫిజికల్ ఎఫిషియన్సీ, 1600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ సంబంధించి ట్రల్ రన్ దేహదారుఢ్య పరీక్షల సరళని ఎస్పీ పరిశీలించారు.

December 29, 2024 / 07:42 PM IST

బెజగం రవికుమార్‌కి భారత కళా రత్న పురస్కారం 

PLD: సత్తెనపల్లికి చెందిన పౌరాణిక కళాకారుడు బెజగం రవి కుమార్ ‘పుడమి సాహితీ వేదిక నల్గొండ వారిచే’ భరత కళారత్న జాతీయ గౌరవ పురస్కారం ప్రధానం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామం వేదికగా పుడమి సాహితీ వేదిక 6వ వార్షికోత్సవ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన సాహిత్యం పొందినవారు పాల్గొన్నారు.

December 29, 2024 / 07:42 PM IST

పమిడిముక్కలలో పర్యటించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలంలో ప్రైవేట్ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, పాల్గొన్నారు. అనంతరం వైసీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు వైసీపీ నాయకులు, కార్యకర్తలని ఆప్యాయంగా పలకరించారు. వైసీపీ అధికారంలో ఉంటే బాగుండేదని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారని, ఆ విషయాన్ని కార్యకర్తలు నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు.

December 29, 2024 / 07:42 PM IST

40వ రోజు కొనసాగిన దీక్షలు

PPM: గిరిజన గురుకుల ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు 40వ రోజు పార్వతీపురంలో ఆదివారం తమ నిరసన కొనసాగించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు దివాకర్, రమేశ్, రాజేశ్, రమణ, శ్రీను, తిరుపతి నాయుడు, రమణ, జ్యోతి పాల్గొన్నారు.

December 29, 2024 / 07:42 PM IST

గుర్తుతెలియని వృద్ధుడికి దహన సంస్కారాలు

అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో పోలీసులు ‘ఆ నలుగురు సేవా సమితి’ సభ్యులకు సమాచారం అందించారు. అనాధ శవానికి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ నలుగు సేవా సమితి సభ్యులు అంతక్రియలు నిర్వహించారు.

December 29, 2024 / 07:38 PM IST

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన నిర్వాహకులు విజయ్ ప్రసాద్‌కు సన్మానం

కర్నూలు: మద్దికెరలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు విజయ్ ప్రసాద్ యాదవ్ నిస్వార్థ సేవలను గుర్తించి గుంతకల్ ఆర్డీవో రాజబాబు, పోలీస్ అధికారులు మనోహర్, వెంకటస్వామి, రాఘవేంద్ర కొండయ్య శాలువాతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. విజయ్ ప్రసాద్ యాదవ్ కరోనా సమయంలో వృద్ధులకు, పేదలకు, కళాకారులకు, కళా రంగానికి,గోవులకు ఎంతో సేవ చేశారని వారన్నారు.

December 29, 2024 / 07:37 PM IST