కృష్ణా: పమిడిముక్కల మండలంలో ప్రైవేట్ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, పాల్గొన్నారు. అనంతరం వైసీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు వైసీపీ నాయకులు, కార్యకర్తలని ఆప్యాయంగా పలకరించారు. వైసీపీ అధికారంలో ఉంటే బాగుండేదని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారని, ఆ విషయాన్ని కార్యకర్తలు నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు.