• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వీఎంఆర్డీఏలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

VSP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వీఎంఆర్డీఏలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఉద్యోగ్ భవన్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను ఉద్యోగులు తొలగించి శుభ్రపరిచారు. అనంతరం కార్యదర్శి మురళీకృష్ణ సిబ్బందితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

February 21, 2026 / 04:02 PM IST

జమ్మలమడుగులో కార్డన్ అండ్ సర్చ్

KDP: జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్ ఉత్తర్వుల మేరకు SDPO వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ కాలనీలో ఉదయం 4.30 గంటల నుంచి సోదాలు చేపట్టారు. స్వాధీనం చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

February 21, 2026 / 04:02 PM IST

ఆల్ ఇండియా పోటీలకు ఎల్కల్ వాసి

SDPT: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి. సతీష్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్య ప్రదేశ్‌లో జరుగనున్నాయి. దీంతో అతన్ని పలువురు అభినందించారు.

February 21, 2026 / 04:01 PM IST

వైసీపీ MLCలు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు: మంత్రి

E.G: శాసనమండలిలో వైసీపీ MLCలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్సీలు కాళ్లకు చెప్పులు వేసుకుని దేవుడి ఫొటోలు పట్టుకోవడం అత్యంత అపచారమన్నారు. ఈ ఘటనపై జగన్ మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

February 21, 2026 / 04:01 PM IST

‘మురికి కాలువల్లో పూడిక తొలగించాలి’

AKP: ఎలమంచిలి పట్టణం ధర్మవరం ప్రాంతంలో శనివారం పర్యటించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మురికి కాలువలను పరిశీలించారు. తక్షణం కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం డ్రైనేజ్ నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. డ్రైనేజ్‌పై అనధికారికంగా ఉంచిన పలకలను తొలగించాలని ఆదేశించారు. గత పాలకులు డ్రైనేజ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారన్నారు.

February 21, 2026 / 04:01 PM IST

13వ వార్డు కౌన్సిలర్ స్నేహపై అనర్హత వేటు

ASF: మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు 13వ వార్డు కౌన్సిలర్ స్నేహపై చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారి, RDO జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించి విప్ ధిక్కరణ నిజమని తేల్చారు. తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారం ఆమెను కౌన్సిలర్ పదవి నుంచి అనర్హురాలిగా ప్రకటించారు.

February 21, 2026 / 04:01 PM IST

‘కొబ్బరి రైతులను ఆదుకోవాలి’

ELR: కొబ్బరికాయలు ధరలు పడిపోకుండా చర్యలు చేపట్టి కొబ్బరి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరులో ఆయన మాట్లాడారు. ఇటీవల కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లలో కొబ్బరి సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని గుర్తు చేశారు.

February 21, 2026 / 04:00 PM IST

అధిక శబ్ద సైలెన్సర్లు, హారన్ల ధ్వంసం

KRNL: జిల్లాలో అధిక శబ్దం చేసే బైక్ సైలెన్సర్లు, ఆటో హారన్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 100 సైలెన్సర్లు, 500 హారన్లను సీజ్ చేసి రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. శబ్ద కాలుష్యంపై ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మోటార్ వాహన చట్టం ప్రకారం అనుమతి లేని మార్పులు చేసిన వాహనాలను నడుపరాదన్నారు

February 21, 2026 / 04:00 PM IST

పుట్టపర్తిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శనివారం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 243 మందికి రూ.2.44 కోట్ల మేర ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 21, 2026 / 04:00 PM IST

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ. 45.85 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైంది. ఇందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 36 మందికి రూ. 36.60 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. శనివారం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

February 21, 2026 / 04:00 PM IST

జీరో వేస్ట్ లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం

NDL: డోన్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ‘జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొని పరిశుభ్రత పనులను పరిశీలించారు. చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పరిశుభ్రమైన వాతావరణంపై అవగాహన పెంపు అవసరమని సూచించారు.

February 21, 2026 / 04:00 PM IST

అన్న క్యాంటీన్లను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

KKD: పేద ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అన్న క్యాంటీన్లలో అందజేయాలని కాకినాడ అదనపు కమిషనర్ సుధాకర్ సూచించారు. శనివారం ఆయన వివేకానంద పార్క్, రమణయ్య పేటలోని అన్న క్యాంటీన్లను తనిఖీ చేశారు. ఆహారాన్ని రుచి చూసి అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

February 21, 2026 / 04:00 PM IST

‘హిందూ ధర్మంపై వైసీపీ విష ప్రచారం’

AP: హిందువులకు మాజీ సీఎం జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. చెప్పులు వేసుకుని స్వామివారి ఫొటోలు పట్టుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్‌లో ఇదంతా జరిగిందని తెలిపారు. హిందూ ధర్మంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు లీగల్ నోటీసులు ఇస్తామన్నారు.

February 21, 2026 / 04:00 PM IST

‘వ్యర్థాల నిర్వహణలో ‘జీరో లిట్టర్’ నగరంగా తీర్చిదిద్దుతాం’

GNTR: గుంటూరు నగరాన్ని వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిపి “జీరో లిట్టర్” నగరంగా తీర్చిదిద్దుతామని గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం ఉద్యోగ నగర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కంపోస్ట్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. డంపింగ్ యార్డులపై భారం తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు

February 21, 2026 / 03:59 PM IST

‘ప్రకాశం జిల్లాకు డీఎస్సీ పోస్టులు పెంచాలి’

ప్రకాశం: త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకాశం జిల్లాకు అధిక సంఖ్యలో పోస్టులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కోరారు. శనివారం ఈ మేరకు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు.

February 21, 2026 / 03:58 PM IST