• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వ్యక్తికి సిల్వర్ మెడల్

NZB: తెలంగాణ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీశ్ తేజ సిల్వర్ మెడల్ సాధించాడు. HYD లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 65 కేజీల కేటగిరిలో హరీశ్ తేజ కోచ్ రాజ్ కుమార్ సహకారంతో స్నాచ్లో 96, క్లీన్ అండ్ జెర్క్111 కేజీల బరువెత్తి మొత్తం 207 కేజీల బరువుతో ద్వితీయ స్థానంలో నిలిచారు.

February 24, 2026 / 06:03 AM IST

‘బోధన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి’

WGL: ఖిలా వరంగల్ ఏబీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ సత్య శారద సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సౌకర్యాలు, బోధన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

February 24, 2026 / 06:02 AM IST

కామారెడ్డిలో నేడు జాబ్ మేళా

KMR: కామారెడ్డిలో నేడు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

February 24, 2026 / 06:02 AM IST

ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై కేసు నమోదు

ASF: ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన అల్లర్లు, మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో ఇప్పటికే మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ కాగా, 13 మంది BRS నాయకులపై కేసు నమోదు చేశారు. ఆ గొడవలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను MLA నెట్టేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 06:02 AM IST

అభివృద్ధికి నిధులు ఇవ్వండి: ఎమ్మెల్సీ రాజశేఖర్

E.G: గోదావరి సెంట్రల్ డివిజన్ ధవళేశ్వరం సర్కిల్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరుతూ MLC రాజశేఖర్ సోమవారం సీఎం చంద్రబాబును కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో కలిసి ఆయన సీఎంకు వినతిపత్రం అందజేశారు.కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయాలని కోరారు.

February 24, 2026 / 06:00 AM IST

భారీ జీతంతో ESIC పోస్టులు.. అప్లై చేశారా?

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC)లో 40 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. 5 ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా.. MSc/MD/MS/DNB/DM/MCh/PhDలో ఉత్తీర్ణత, పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతంగా పోస్టును బట్టి రూ.1,30,797 నుంచి రూ.2,22,543 వరకు చెల్లిస్తారు.

February 24, 2026 / 06:00 AM IST

నిబంధనల ప్రకారం తుది జాబితా ఎంపిక: కలెక్టర్ రాజర్షి షా

ADB: రేవంత్ అన్న కా సహారా-మిస్కినో కే లియే పథకం కింద ఆర్థిక సహాయం కోసం కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన నిన్న ఇంటర్వ్యూల కార్యక్రమం చేపట్టారు. ఈ పథకం కోసం మొత్తం 67 మంది దూదేకుల, ఫకీర్ కమ్యూనిటీలతో పాటు సామాజికంగా వెనుకబడిన ముస్లింలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం తుది జాబితా ఎంపిక చేస్తామని తెలియజేశారు.

February 24, 2026 / 06:00 AM IST

పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్: ఎస్పీ

SS: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

February 24, 2026 / 05:59 AM IST

పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ ప్లాట్ల కేటాయింపు

ATP: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మూడు ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసినట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ తెలిపారు. కూడేరు, తిమ్మసముద్రం, ఊరిచింతల గ్రామాల్లో 293 ప్లాట్లు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 05:46 AM IST

‘వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’

అన్నమయ్య: సీఎం చంద్రబాబు తల్లిదండ్రులపై అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను వైసీపీ నాయకులు సమర్థించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి మండిపడ్డారు. రైల్వే కోడూరులో సోమవారం ఆయన మాట్లాడారు. చట్టం తన పని తాను చేస్తోందని, కక్షసాధింపులు లేవని స్పష్టం చేశారు.

February 24, 2026 / 05:34 AM IST

మైనర్ వాహనం నడిపి పట్టుబడితే యజమానిపై కేసు: SP

ASF: త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌ నిషేధమని, మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ లేకపోవడం, నంబర్ ప్లేట్ లేకపోవడం, తప్పుడు నంబర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

February 24, 2026 / 05:24 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు: ఎస్పీ

జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మైనర్, డ్రంక్&డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి అవసరమైతే లైసెన్సులు రద్దు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటారు.

February 24, 2026 / 05:21 AM IST

నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 43 వాహనాలు సీజ్

KNR: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. వన్ టౌన్ కార్నర్ వద్ద సీపీ గౌష్ ఆలం ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ కరీం ఉల్లా ఖాన్ తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లు లేనివి, ఫ్యాన్సీ, అస్పష్టంగా ఉన్న 43 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.

February 24, 2026 / 05:14 AM IST

‘క్రమక్రమంగా పుంజుకుంటున్న బీజేపీ’

MNCL: బెల్లంపల్లిలో BJP క్రమక్రమంగా పుంజుకుంటోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ 34వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన కొక్కేర రామ్మూర్తిని ఆయన కలిసి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేయాలన్నారు.

February 24, 2026 / 05:10 AM IST

‘వితంతు పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలి’

KDP: వితంతువులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సింహాద్రిపురం MPDO శ్రీనివాసరావు తెలిపారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ఆప్షన్ ఓపెన్ కాలేదనే సోషల్ మీడియా వార్తలు అవాస్తవమని, ప్రజలు ఇలాంటి నకిలీ వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. వితంతువులు విడో పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

February 24, 2026 / 05:09 AM IST