• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తన కజిన్ వరుణ్ గాంధీ పై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్..!

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ…..త్వరలోనే కాంగ్రెస్ లోకి అడుగుపెడతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వరుణ్ గాంధీ… బీజేపీ విధానాలపై విమర్శలు చేస్తూ ఉండటంతో.. ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. కాగా… ప్రస్తుతం జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఇదే విషయం ప్రశ్నించగా… ఆయన షాకింగ్ కామెంట్స్  చేశారు. వరుణ్ గాంధీ… కాంగ్రెస్ లోకి రారు ...

January 17, 2023 / 06:17 PM IST

అక్కడ గెలిస్తే టీడీపీదే ప్రభుత్వం, 25వేల మెజార్టీ ఖాయం: కేశినేని

నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్నవాళ్లకు విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఇస్తే గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని అన్నారు. పశ్చిమలో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక్కడ సరైన అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి 25వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వెస్ట్‌లో ఎవరికి పదవులు ఇవ్వాలనే విషయాన్ని తాను చెప్పలేదన్నారు. భవిష్యత్తులో అన్ని డివిజన్లలో టీడీపీలోకి చేరి...

January 17, 2023 / 05:43 PM IST

పాక్ మహిళతో దావూద్ రెండో పెళ్లి..!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ నెలలో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)  అధికారులకు తెలియజేశాడు. ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకముందే …పాకిస్తాన్ కి చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. టెర్రర్ ఫండింగ్ కేసులో భాగంగా దావూద్ ఇబ్రహీంపై గతంలో కేసు నమోదు చేస...

January 17, 2023 / 05:22 PM IST

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ మంత్రి కేటీఆర్..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. మంత్రి కేటీఆర్… సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన చాలా మంది సమస్యలను పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా…. ఆ సోషల్ మీడియా కారణంగానే ఆయన ప్రస్తుతం ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా  ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో కేటీఆర్ చోటు దక్కించుకున్నారు.వరల్డ్ టాప్ 30 జాబితాలో మ...

January 17, 2023 / 04:03 PM IST

రోజా తగ్గేదేలే అంటారు, పవన్ కళ్యాణ్‌పై పోటీకి అలీ రెడీ!

వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రముఖ సినీ నటుడు, ఆ పార్టీ నేత అలీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు పవన్ పైన పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నవ్వుతూ… అది జగన్ అభిప్రాయం, మా ముఖ్యమంత్రి ఇక్కడి నుండి పోటీ చెయ్ అలీ అంటే నేను రెడీ అన్నారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు […]

January 17, 2023 / 03:16 PM IST

దేవుడితో వ్యాపారమా? బీజేపీకి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీ రామారావు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేవుడిపై కూడా వ్యాపార కోణంలో వ్యాఖ్యానించి, విమర్శల పాలవుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో కేటీఆర్ దావోస్‌లో ఉన్నారు. ఇక్కడ పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల అధిపతులతో భేటీ అవుతున్నారు. తెలంగాణ-అవకాశాల ప్రపంచం పేరిట తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలతో భేటీ సం...

January 17, 2023 / 02:33 PM IST

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌కు రోజా ఎందుకు వెళ్లడం లేదంటే?

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం చూశాక, తనకు వెళ్లాలనిపించలేదని ఏపీ మంత్రి రోజా అన్నారు. బాలయ్య బాబుతో తాను ఏడు సినిమాలు చేశానని, అవన్నీ హిట్ సినిమాలేనని, కానీ రాజకీయాల్లో ఆయన థియరీనే సరైనది కాదన్నారు. తన బావ కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోందని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలు మృత్యువాత పడుతున్నా సభలకు అనుమతి ఇవ్వాలా అని ప్రశ్నించారు. తనకు అన...

January 17, 2023 / 12:46 PM IST

టీమిండియా సభ్యులతో కలిసి జూ.ఎన్టీఆర్ సందడి

టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన...

January 17, 2023 / 12:40 PM IST

ఆ 25మందిని మారిస్తే… 100 సీట్లు గ్యారెంటీ.. ఎర్రబెల్లి

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని… తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తన సర్వే ఎప్పుడూ తప్పు కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు పూర్తి నమ్మకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా… ఈ క్రమంలో.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ కి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇ...

January 17, 2023 / 11:38 AM IST

పాలమూరు నుండి నిన్న మోడీ, నేడు షా: వ్యూహమేంటి?

తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ముందుకు సాగుతోంది. 90 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్న కమలదళం కనీసం 65 స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల కోసం వరుసగా సమావేశాలు, భేటీలు నిర్వహిస్తోంది. సోమవారం ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాల్లోను తెలంగాణ నేతలకు దిశాన...

January 17, 2023 / 11:55 AM IST

యాక్సిడెంట్ తర్వాత కోలుకుంటున్న పంత్… ట్వీట్ చేసి మరీ..!

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా… ప్రమాదం నుంచి ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. ముంబయి ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న ఆయన…. ప్రమాదం జరిగిన దాదాపు 18 రోజుల తర్వాత… తొలిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన సర్జరీ విజయవంతమైందని, కోలుకుంటున్నానని ఇకపై వచ్చే ప్రతి సవాలును దైర్యంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, మీ అందరి మద్దతు...

January 17, 2023 / 10:40 AM IST

జగన్ వంటి దుష్టుడితో దోస్తీ వద్దు: కేసీఆర్‌కు రఘురామ

మంచివాడైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దుష్టుడైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో స్నేహం ఏమాత్రం మంచిది కాదని వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ప్రాంతీయతత్వాన్ని వదిలి, జాతీయ దృక్పథంతో ముందుకు సాగాలని పార్టీని టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్‌గా మార్చుకున్నారని, అలాంటి మహానాయకుడైన మీరు జగన్‌కు మద్దతుగా నిలువవద్దని కోరారు. రాష్ట్రంలోని ఓ వర్గం పవన్ కళ్...

January 17, 2023 / 10:32 AM IST

సోదరుడికి టిక్కెట్ ఇస్తే సహకరించను: కేశినేని నాని షాకింగ్

టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు కేశినేని శివనాథ్‌కు లోకసభ టిక్కెట్ ఇస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోను సహకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. అతనితో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చినా మద్దతు ఇచ్చేది లేదన్నారు. ఎవరైనా పార్టీలో పని చేయవచ్చు… పోటీ కూడా చేయవచ్చునని, కానీ క్రిమినల్స్, ల్యాండ్, సెక్స్ మాఫియా గ్రూప్‌లకు టిక్కెట్లు ఇస్తే సహకరించే ప్రసక్తి లేదన...

January 17, 2023 / 08:30 AM IST

Budget 2023:మధ్య తరగతి ప్రజలకు అనుగుణంగా బడ్జెట్..?

బడ్జెట్ కి సమయం అయ్యింది. త్వరలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే… ఈ బడ్జెట్ మధ్య తరగతి ప్రజలకు అనుగుణంగా ఉండనుందని తెలుస్తోంది.  ఆ మాటలను బట్టి ఈసారి మధ్య తరగతి ప్రజలను దృష్టిలోకి ఉంచుకొని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. త‌న‌కు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాల గురించి తెలుస‌ని, తాను కూడా మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తినేన‌ని ని...

January 16, 2023 / 07:53 PM IST

చంద్రబాబు భవిష్యత్తు ఎప్పుడో చిరిగిపోయింది: పెద్దిరెడ్డి

చంద్రబాబు కారుకూతలు కూస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా టీడీపీ జెండా పీకేయడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం అన్నారు. పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి పని అయిపోయిందని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ప్రజలు తనకు బుద్ధి చెప్పడం కాదని,...

January 16, 2023 / 07:10 PM IST