ప్రస్తుతం ఎక్కడ చూసిన కాంతార గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం మామూలుగా లేదు. కన్నడ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కాంతార.. ఇప్పుడు మిగతా భాషల్లోను దుమ్ముదులిపేస్తోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం చేసిన ఈ చిత్రం.. కన్నడలో సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్కడ ఈ సినిమా కాసుల వర్షం కురిపించడంతో.. ఆ తర్వాత అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్‌ను అక్టోబరు 15న విడుదల చేశారు.
ఇక తెలుగులో ఈ సినిమా అంతపెద్ద హిట్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. నాలుగు రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ అందుకుంది. అంటే కాంతార(kantara) మౌత్ టాక్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ 2 కోట్ల వరకు జరిగిన ఈ సినిమా.. తొలి రోజే బ్రేక్ ఈవెన్‌ను సాధించి.. అల్లు అరవింద్‌కు భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది. అందుకే గీతా ఆర్ట్స్‌లో రిషబ్ శెట్టితో ఓ సినిమా ప్రకటించారు అల్లు అరవింద్.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని కాంతార క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చాడు రిషబ్ శెట్టి. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు రిషబ్. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్, ప్రీక్వెల్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని.. కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న తర్వాత దాని గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కాంతార-2(kantara2) ఉంటుందా.. లేదా గీతా ఆర్ట్స్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కాంతార ఓ సంచలనం అని చెప్పొచ్చు.