జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై అధికార వైసీపీ పార్టీ విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్లపై ఎక్కువ టార్గట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై విమర్శలు చేసేవారికి పవన్ కౌంటర్ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి, అలాగే ప్యాకేజీ కల్యాణ్ అంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై మండి పడుతూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొదటి ఇద్దరు భార్యలతో తనకి కుదరకపోవడం వల్లే వారికి విడాకులు ఇచ్చి భరణం చెల్లించిన తర్వాతే మూడవ పెళ్లి చేసుకున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ తన భార్యలకు భరణం చెల్లించానని వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే యువతిని వివాహం చేసుకొని కొంతకాలం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి భరణంగా ఐదు కోట్లు చెల్లించినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే బద్రి సినిమా షూటింగ్ సమయంలో రేణు దేశాయ్(Renu desai)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఆమెని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో పవన్ కళ్యాణ్ ఆమెకు విడాకులు ఇచ్చి తన ఆస్తి మొత్తం భరణం గా చెల్లించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లేజినోవో ని మూడవ వివాహం చేసుకొని ప్రస్తుతం ఆమెతో కలిసి జీవిస్తున్నాడు.
అయితే… పవన్ చెప్పిన తర్వాత.. అందరూ రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తుండటం గమనార్హం. పవన్… రేణు దేశాయ్ ని మోసం చేశాడనే భావన చాలా మందిలో ఉండేది. అయితే…. ఆయన ఆమెకు ఆస్తి మొత్తం ఇచ్చిన తర్వాత కూడా విమర్శలు చేసిందా అంటూ రేణు దేశాయ్ ని విమర్శిస్తుండటం గమనార్హం.