భారీ అంచనాలున్న ఆదిపురుష్(adipurush) మూవీ.. ఒకే ఒక్క టీజర్‌తో అంచనాలను తారుమారు చేసేసింది. అంతేకాదు ఎన్నో పుకార్లకు.. ట్రోలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఆదిపురుష్ టీమ్ డైలమాలో ఉందనే న్యూస్.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా.. మరోసారి పోస్ట్ పోన్ అవనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికైతే.. ఈ ఏడాది ఆగష్టులోనే ఆదిపురుష్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ కారణంగా.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఇక అప్పటి నుంచి ఆదిపురుష్ రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదు కదా.. కనీసం పోస్ట్ పోన్ ఆలోచన కూడా లేనట్టు వినిపించింది. అయితే ఇప్పుడు.. టీజర్ రిజల్ట్ చూసిన తర్వాత.. ఆదిపురుష్ టీమ్ డైలమాలో ఉందనే ప్రచారం జరుగుతోంది. టీజర్లో గ్రాఫిక్స్ బాగాలేదనే కామెంట్స్ బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. అందుకే దర్శకుడు ఓం రౌత్.. గ్రాఫిక్స్ పూర్‌గా ఉన్న కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు, చేర్పులు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ నిజంగానే కరెక్షన్స్ చేస్తే.. అందుకోసం చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే.. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవడం కష్టమనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో సమ్మర్లో రిలీజ్ చేయాలనే డైలమాలో ఉన్నట్టు టాక్. అయితే ఇదంతా ప్రచారం మాత్రమే.. ఎందుకంటే ప్రస్తుతానికి సంక్రాంతి టార్గెట్‌గానే ఆదిపురుష్ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. మరో టీజర్ లేదా సాంగ్ రిలీజే చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆదిపురుష్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి.