• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తారకరత్నకు ఎక్మో చికిత్స

బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్సలో భాగంగా ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం హాస్పిటల్ నుండి నిన్న అర్ధరాత్రి తారకరత్నను బెంగళూరుకు తరలించారు. ఇక్కడ ఎక్మో చికిత్సను అందించే మూడు హాస్పిటల్లలో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి. చంద్రబ...

January 28, 2023 / 01:44 PM IST

సీబీఐ విచారణకు వెళ్తూ .. వైఎస్ విజయమ్మతో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి భేటీ

వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి  సీబీఐ విచారణకు వెళ్తూ వైఎస్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. హైదరాబాద్  లోటస్ పాండ్ లో ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణకు హాజరుకానున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకున్నారు. అవినాశ్ స్టేట్ మెంట్...

January 28, 2023 / 01:18 PM IST

ప్రపంచంలోనే పులులకు రాజధానిగా భారత్

ప్రపంచంలో పులులు ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉండేది భారత్ లోనే. 70 శాతం పెద్ద పులులు ఇండియాలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సర్కార్ స్వయంగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది. పులుల వేట పట్ల కఠినంగా వ్యవహరించడం వల్ల వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పెద్ద పులుల సంతతి భారత్ లో పెరిగిందని కేంద్రం తెలిపింది. దేశంలో ఏటా 6 శ...

January 28, 2023 / 01:01 PM IST

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 2391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే వివిధ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆర్దిక మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ద్వారా ఇందుకు సంబందించిన వివరాల్ని పోస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తెలంగాణ రె...

January 28, 2023 / 12:13 PM IST

తెలంగాణ ఎమ్మెల్సీ కవితతో నటుడు శరత్ కుమార్ భేటీ

తెలంగాణ ఎమ్మెల్సీ, కల్వకుంట్ల కవితతో ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్‌గా జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాల విస్త...

January 28, 2023 / 10:54 AM IST

25 ఏళ్లకే హైకోర్టు జడ్జిగా పేదింటి బిడ్డ..హ్యాట్సాఫ్ గాయత్రి

నిరుపేద కుటుంబం పుట్టి ఓ యువతి ఉన్నత శిఖరం చేరింది. పట్టుదలతో కష్టపడి చదివి జడ్జి అయ్యింది. అది కూడా అతి చిన్న వయసులోనే జడ్జిగా మారి యువతకు ఆదర్శమైంది. ఓ నిరుపేద కూతురు గాయత్రి 25 ఏళ్లకే కర్ణాటకలోని కోలారు సివిల్ కోర్టు జడ్జిగా నియమితురాలైంది. బెంగళూరులోని విధానసౌధం ఎదురుగా కర్ణాటక హైకోర్టు ఉంది. ఆ కోర్టులో సివిల్ జడ్జీల పోస్టులకు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష పరీక్ష జరిగింది. ఆ పరీక్షకు కోలారు జిల్లా ...

January 28, 2023 / 10:52 AM IST

ఘర్ వాపసీ కావాలన్న బండి సంజయ్

కార్యకర్తలు నాయకుల స్థాయికి ఎదిగి అవకాశం బిజెపిలోనే ఉంటుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుందని, మిగతా అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే అన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్తను అయిన తను రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యానని, చాయ్ వాలా ప్రధాని అయ్యారని తెలిపారు. తాను రాష్ట్ర అధ్యక్షుడినైనా తప్పు చేస్తే అడిగే హక్కు ప్రతి కార్యకర్తకు ఉంటుందన్నారు. నేను దానిని స...

January 28, 2023 / 10:48 AM IST

ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి మృతి.. మంత్రి కేటీఆర్‌ సంతాపం

ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి మృతిచెందారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. కాగా, శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవ...

January 28, 2023 / 10:28 AM IST

తారకరత్న బెంగళూరుకు తరలింపు

నందమూరి తారకరత్నను కుప్పం పీఈస్ హాస్పిటల్ నుండి వైద్యులు బెంగుళూరుకు తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది తరలించింది. అత్యధునిక పరికరాలుతో కూడిన అంబులెన్స్ లో తరలించారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థకు గురై, సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స క...

January 28, 2023 / 10:20 AM IST

పోస్టాఫీసులో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మొత్తం నోటిఫికేషన్ లో ఏపీకి సంబంధించి 2,480 పోస్టులు, తెలంగాణ నుంచి 1266 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైన వారు ఈ పోస్టుకు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ...

January 28, 2023 / 10:19 AM IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్దాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు ప్లాన్ జరుగుతుందని ఈ సారి మాజీ అధ్యక్షుడు జర్దారీ కుట్ర పన్నారని అన్నారు. ఓ ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు ఇచ్చారని తెలిపారు. సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మును జర్దారీ తన హత్యకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, గతంలో తన హత్యకు కుట్ర పన్నిన వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ఇమ్రాన్ అన్నారు. వజీరాబాద్‌ల...

January 28, 2023 / 10:11 AM IST

సానియా మీర్జాకు షోయెబ్ ట్వీట్

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య, భారత టెన్నిస్ తార సానియా మీర్జాపై ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా చేసిన ప్రయత్నానికి గర్విస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్… సానియాకు భావోద్వేగ సందేశంతో ట్వీట్ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్‌తో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్‌...

January 28, 2023 / 09:55 AM IST

ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించిన నరేష్

టాలీవుడ్ సినీయర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి తనను అంతం చేయడానికి రమ్య రఘుపతి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. వెంటనే రూ.10 కోట్లు తనకు ఇవ్వాలని రమ్య తనను బెదిరించినట్లు తెలిపారు. తాను అంత డబ్బు ఇవ్వనని అన్నందుకు సుపారీ గ్యాంగ్‌తో కలిసి తన హత్యకు కుట్ర పన్నిందన్నారు. తనను చంపేందుకు గతే...

January 28, 2023 / 09:35 AM IST

సైకో జగన్ పోవాలి… సైకిల్ రావాలి… అచ్చన్న

నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం బహిరంగ సభలో టిడిపి ఏపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యువత భవిష్యత్తు కోసమే లోకేష్ యువగళం అన్నారు. లోకేష్ దమ్మున్న మగాడు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తును కాపాడేందుకు లోకేష్ తొలి అడుగు వేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. అధికారం కోసమైతే లోకేష్ 400రోజులు 4వేల ...

January 28, 2023 / 09:10 AM IST

బైకర్‌ను కొట్టిన ఎస్సై.. సారీ చెప్పించి కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

బైక్ పై రాంగ్‌రూట్‌లో వచ్చిన యువకుడిని లాఠీతో కొట్టిన ఎస్సైపై మాజీ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైతో యువకుడికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా కేసు నమోదు చేయించారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో జరిగిందీ ఘటన. కూనారపు భిక్షపతి అనే యువకుడు రాంగ్‌రూట్‌లో ద్విచక్ర పై వస్తుండడాన్ని గమనించిన స్థానిక ఎస్సై రామకృష్ణ అతడిని ఆపి లాఠీతో కొట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ కలెక్టర్ ఆకునూరి ముర...

January 28, 2023 / 08:05 AM IST