KNR: అకాల వర్షాల నేపథ్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ రామడుగు మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామడుగు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
TPT: తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం పల్లంపేట ట్యాంకును పరిశీలించారు. భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. మండలానికి చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.
BDK: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధినే కనిపిస్తుందని, ఇప్పుడు మాత్రం హైడ్రా బుల్డోజర్ అల్లకల్లోలం సృష్టిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తదితర ప్రముఖులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
NLG: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా.. రహ్మత్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు.
VKB: DCC నియమకాల కోసం CM రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. జిల్లా DCC కోసం ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎవరి ప్రయత్నం సక్సెస్ అవుతుందోనని ఆయా వర్గాల నాయకులు ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ DCC పదవి ఖరారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరాటాలు ప్రారంభమవుతాయని కార్యకర్తలు అంటున్నారు. రఘువీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్ రేసులో ఉన్నారు.
GNTR: మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో, గుంటూరు నగరంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆదివారం మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమీక్షలో అధికారులకు, కార్పొరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా, క్షేత్ర స్థాయిలో అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు.
TPT: తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖలకు చెందిన అధికారులతో తుఫాను సందర్బంగా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. మొంథా హెచ్చరికల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
NLG: కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వేడుకున్నారు. కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో కంట మహేశ్వర స్వామి పండుగకు ఆదివారం హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడిపంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
BDK: 150 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తులకు ధార దత్తం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపడతామని GLBKU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ అన్నారు. కొత్తగూడెం ఐఎఫ్టియు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘కుమారి 21F’ మూవీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించగా.. దర్శకుడు సుకుమార్ కథను అందించారు. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారట. ‘కుమారి 22F’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ భార్య తబిత తన కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మించనున్నట్లు సమాచారం.
CTR: జిల్లా ఎఆర్ కార్యాలయంలో పోలీసుల వినియోగించే ఆయుధాల ప్రదర్శనను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ప్రారంభించారు. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులకు స్వయంగా ఆయుధాలు గురించి వివరించారు. పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా ప్రతి ఏటా రెండు రోజులపాటు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. రాబోయే 24 గంటల్లో తుఫానుగా బలపడి.. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోర్ట్ బ్లేయర్‌కు 610 KM, చెన్నైకి 790 KM, విశాఖకు 850 KM, కాకినాడకు 840 KMల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
NDL: శక్తి యాప్ ఆపదలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు రక్షణ కవచంలా ఉంటుందని మహిళ స్టేషన్ సీఐ జయరాం పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం విద్యార్థినులకు బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలు, ఈవ్ టీజింగ్, ఫోక్స్ చట్టాల గురించి వివరించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
KKD: జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి. కొత్తూరులో పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమతులు లేని 50 బైకులు, 1 వ్యాన్, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
మునగ గింజలను ఎండబెట్టి వాటి నుంచి తయారుచేసిన నూనెతో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ నూనెను తరచూ చర్మానికి రాయడం వల్ల అది మృదువుగా మారి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పొడిచర్మతత్వం ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మంపై కాలిన మచ్చలు, గాయాలు నయమవుతాయి. పగిలిన పెదవులకు అప్లై చేసే మృదువుగా మారుతాయి.