తెలంగాణ ప్రజలకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక AEJO713 Batch థైరోనార్మ్ టాబ్లెట్‌లు ఉపయోగించకూడదని వెల్లడి అవి ఇళ్లలో ఉన్నా, షాపుల్లో ఉన్నా కూడా తిరిగి ఇచ్చేయాలని సూచన 25 MCG ట్యాబ్లెట్లకు కంపెనీ 88 MCG పేరుతో లేబుల్ వేసిన కంపెనీ తప్పిదాన్ని గుర్తించిన కంపెనీ ఆ ట్యాబెట్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటన ఇప్పటికే తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి వచ్చిన 3073 టాబ్లెట్ సీసాలు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) ఫ్యామిలీని గద్దె దించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం సహా TSPSC కూడా విఫలమైందని విమర్శించారు. ఈ క్రమంలో యువత(youth) కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు.
ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ఎందుకంటే.. ఆయన ఎంత ఒత్తిడి ఉన్నా, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. తొందరగా కోపం రాదు. ప్రశాంతంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ధోనీ(MS Dhoni)కి కోపం వచ్చింది. రనౌట్ చేయబోతుంటే అడ్డు వచ్చాడనే కోపంతో తన జట్టు ఆటగాడు పతిరనాపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సికింద్రాబాద్ కళాసిగూడలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. ఉదయం పాల ప్యాకెట్ కొనేందుకు కిరణా దుకాణానికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారి మౌనిక ప్రమాదవశాత్తు నాలాలో పడి మృత్యువాత చెందింది. అయితే వర్షం కారణంగా నాలా పై భాగానికి రంధ్రం పడటం వల్ల..ఆ విషయం తెలియని చిన్నారి నాలా పై నుంచి నడిచి అందులో పడిపోయింది. ఆ తర్వాత గమనించిన గమనించిన స్థానికులు చూసి పోలీసులకు విషయం తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థ...
జేఈఈ మెయిన్-2023 సెషన్ -2 ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య మొదటి ర్యాంకుతో సాధించి సత్తా చాటాడు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే సొంతం చేసుకున్నారు.
మూడు గంటల పాటు నగరవ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లపైకి భారీగా వరద చేరింది. చాలా ప్రాంతాల్లో తెరపినివ్వకుండా వర్షం పడింది. కాగా వర్షం వలన పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున వర్షం రావడంతో పేపర్ వేసేవాళ్లు, పాలవారు, పారిశుద్ధ్య సిబ్బంది పనులకు ఆటంకం ఏర్పడింది.
ఎమ్మిగనూరు (Emmiganur) నియోజకవర్గం ఇబ్రహీంపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను లోకేశ్ పరామర్శించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని లోకేశ్ వద్ద మిర్చి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం పంట నష్టం అంచనా వెయ్యడానికి కూడా ఎవరూ రాలేదని రైతులు వాపోయారు.
అటవీ అధికారులకు, ఆదివాసీలకు, తండా ప్రాంత ప్రజలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అంతేకాక అటవీ ప్రాంత ప్రజలు.. తమ ప్రాంతానికి వచ్చిన అధికారులపై దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా(Kamareddy District) లో అలాంటి ఘటన జరిగింది
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దిశానిర్దేశంలో ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నల సంక్షేమం కోసం విభిన్న కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ (Tej Pratap) యాదవ్ సంబరపడిపోతున్నారు. తండ్రి లాలూ ఢిల్లీ నుంచి తిరిగి పట్నాకు వచ్చిన తరుణంలో సైకిల్ పై చక్కర్లు కొట్టారు.
ఏపీలో వేసవి సెలవు(Summer Holidays)ల్లో ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు 23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
హీరోగా నా తొలి సినిమా పేరు 'భైరవి' అని రజనీకాంత్ (Rajinikanth) గుర్తుచేశారు. పాతాళభైరవి సినిమా గుర్తుకొచ్చి హీరో పాత్రకు ఒప్పుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ దుర్యోదనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రభావం తనపై చాలా ఉందని, గద పట్టుకుని ఎన్టీఆర్‌ను అనుకరించేవాడినని తెలిపారు