ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా… అంటూ బాహుబలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నోరా ఫతేహీ గుర్తుందా? అదొక్కటే కాదు.. చాలా సినిమాల్లో నోరా ఐటెమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ వేసి రచ్చ చేసింది. నిజానికి బాలీవుడ్‌లో తను స్టార్ హీరోయిన్. కానీ.. తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ అభిమానుల మనసు దోచుకుంది. తన అందానికి పడిపోయారు. బాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉండే నోరా ఫతేహీ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ హడావుడి...
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. పార్టీ అత్యంత కీలక నేత తన పదవికి రాజీనామా చేసి, అధిష్టానానికి షాకిచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్ మంగళవారం ఆ పదవికి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, ఆయనతో కలిసి తాను పని చేయలేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం లేఖ రాసిన విషయం వెలుగు చ...
రాబోయే వాలంటైన్స్ డేను బహిష్కరించాలని విశ్వహిందు పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. లవర్స్ డేను బహిష్కరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించాయి. వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దామని వీహెచ్‌పీ జనరల్ సెక్రటరీ పండరినాథ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జ...
కాంతార(kantara) మూవీ విజయవంతంగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు ప్రీక్వెల్(prequel) రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మీరు చూసింది వాస్తవానికి పార్ట్ 2 అని..పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. కాంతారా షూటింగ్‌లో ఉండగానే ప్రీక్వెల్ ఆలోచన తన మదిలో మెదిలిందని అన్నారు. కాంతారా చరిత్ర గురించి మరిన్ని వివరాలను పరిశోధిస్తున్నట్లు వెల్లడించా...
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ నేటి నుంచి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ నెల 11 న ఎలక్ట్రిక్ కార్ రేస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఎన్టీఆర్ మార్గ్ లో జరుగగనున్నాయి. దీంతో ఈ రోజు నుంచి 12 వరకు ఎన్టీఆర్ మార్గ్ మూసివేశారు. ఈ మార్గంలో వెళ్లాలనుకునే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అలాగే బస్ రూట్స్ లో కూడా డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ప్ర...
కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తాజాగా సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం లేకుండా చేశారని విమర్మనాస్త్రాలు గుప్పించారు. ఇప్పుడు తన రాజకీయ స్వార్దం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని ఆరోపించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసిఆర్ చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని అన్నారు. జీవనది లాంటి శ్రీరామ్ సాగర్ ను ...
టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం(Turkey earthquake) ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఇరు దేశాల్లో భూప్రకంపనల దాటికి జరిగిన విధ్వంసం దృశ్యాలు చూసి షాక్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఆ క్రమంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ బాధను వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. Shocked to see the visuals of devastation in Turkey &am...
శ్రీశైల మహాక్షేత్రంలో పిబ్రవరి 11 నుంచి 21 తేదీ వరుకు మహాశివ రాత్రి బ్రహ్మొత్సవాలు నిర్వహించనున్నారు. భూకైలాసంగా ప్రసిద్ది చెందిన ఈ దివ్యక్షేత్రంలో 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తా...
ప్రతి ఏటా విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2022లో 7,50,365 మంది భారతీయ విద్యార్థులు.. చదువు కోసం విదేశాలకు వెళ్లారని ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు. గత 6 ఏళ్లల్లో మొత్తం మీద 30 లక్షల మంది విదేశాలకు వెళ్లినట్లు ప్రకటించారు. 2021లో 4,44,553 మంది విదేశాలకు వెళ్లిన విద్యార్థులతో పోలిస్తే 2022లో విదేశాలకు వెళ్లిన వ...
తనకు కాబోయేవాడికి మైక్రోసాప్ట్ లో ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ అతన్ని పెళ్లాడొచ్చా? అని ఓ యువతి నెట్టంట పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగాల్లో కోత పెడుతోన్న విషయం తెలిసిందే. పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ పరిణామాలు ఉద్యోగులపైనే కాదు.. వారిపై ఆధారపడ్డ వారినీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటిదే ఓ వ్యవహారం తాజాగా నెట్టింట వైరల్‌గా మారింద...
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే నిన్న కేంద్ర హోంత్రి అమిత్ షా బీజేపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోమతి జిల్లాలోని అమర్‌పూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన మాజీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)తో పొత్తు క...
వరంగల్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిన డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ తోపాటు కారులో ఉన్న ఆరేళ్ల చిన్నారి కూడా మృత్యువాత చెందింది. దీంతోపాటు కారులోని మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. డీసీఎంకు పంక్చర్ అయిన క్రమంలో రోడ్డు పక్కన ఆపి వారు రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఈ ప్రమ...
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటను రిలీజ్ చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఫిబ్రవరి నెలోని 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ తేదీలకు సంబంధించిన ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లు ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలనుంచి...
టర్కీ, సిరియాల్లో సంభవించిన భీకర భూకంపం(Turkey earthquake) దాటికి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు రెండు దేశాల్లో మృతుల సంఖ్య 4,300 దాటేసిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. టర్కీలో 3000 మందికిపైగా మృతి చెందారని, మరోవైపు సిరియాలో బాధిత మృతుల సంఖ్య 1500కు చేరిందని వెల్లడించారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకున్న అనేక మందిని తొలగిస్తున్నారు. మరోవైపు టర్కీ, సిరియాలో సుమారు 19 వేల...
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో మార్చి 5న శ్రీ ఆది జాంబవ అరుంధతి హిందూ మాదిగ అన్నదాన సత్రానికి భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని అందరి సాయంతో సత్రం నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. సత్ర నిర్మాణ కమిటీ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని డొక్కా తెలిపారు. భక్తుల నుంచి విరాళాలు సే...